Shani Dev: శని ప్రభావంతో ఈ రాశి వారి రాత మారనుంది.. పట్టిందల్లా బంగారమే

Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి.

Update: 2025-05-03 12:15 GMT

Shani Dev: శని ప్రభావంతో ఈ రాశి వారి రాత మారనుంది.. పట్టిందల్లా బంగారమే

Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. అత్యంత నెమ్మదిగా ప్రయణించే శని మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే చాలా మంది శని అనగానే భయపడుతుంటారు. కానీ శని మంచి కూడా చేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో శని మంచి ఫలితాలను అందిస్తాడు. 2025 మార్చి నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించి, 2027 వరకూ అదే రాశిలో సంచరిస్తూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో శని వెండి పాదాలతో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు.

ఈ కాలంలో శని వెండి పాదాల సంచారం మూడు ముఖ్యమైన రాశుల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది. వీరికి వచ్చే రెండేళ్లపాటు విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆ రాశులు ఏంటి.? ఎలాంటి లాభం జరగనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో ముఖ్యమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. ప్రేమ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయమని చెప్పాలి.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఆనందాన్ని పెంపొందించే కాలమిది. అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపార పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. కొత్త బిజినెస్ ప్రారంభించేవారికి శుభప్రదంగా ఉంటుంది.

కుంభరాశి: ఈ రాశి వారికి శని ఆశీస్సులు లభిస్తాయి. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్నవారికి పెళ్లి సంబంధ అవకాశాలు వస్తాయి. సంపదలో పెరుగుదల కనిపించవచ్చు.

మకర రాశి: మకర రాశికి చెందిన వారు వచ్చే రెండున్నర సంవత్సరాలపాటు శనితో అనుకూలతను పొందుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అదృష్టం తోడుగా ఉండి ప్రతి పని విజయవంతంగా సాగుతుంది.

Tags:    

Similar News