Saturn Retrograde Effects: శని తిరగబడితే ఈ రాశుల వాళ్లకి డబ్బే డబ్బు.. 138 రోజుల పాటు పండగే!
Saturn Retrograde Effects: మన జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది.
Saturn Retrograde Effects: శని తిరగబడితే ఈ రాశుల వాళ్లకి డబ్బే డబ్బు.. 138 రోజుల పాటు పండగే!
Saturn Retrograde Effects : మన జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. ఆయన నెమ్మదిగా కదులుతూ ఉంటాడు కాబట్టి, ఏ రాశిలో ఉన్నా చాలా కాలం పాటు దాని ప్రభావం చూపిస్తుంటాడు. అయితే మార్చి నెలలో శని కుంభరాశిని వదిలి మీనరాశిలోకి వచ్చాడు. ఇదిలా ఉండగా, వచ్చే జూలై 13న ఉదయం 7 గంటలకు మీనరాశిలోనే శని వెనక్కి తిరగబోతున్నాడు. అంటే తిరోగమనం చెందబోతున్నాడు. దీని వల్ల దాదాపు 138 రోజుల పాటు కొన్ని రాశుల వాళ్ల మీద మాత్రం డబ్బుల వర్షం కురుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అవును, ఈ టైమ్‌లో శని ప్రభావంతో కొందరు నష్టపోతే, మరికొందరు మాత్రం బాగా లాభపడతారట. ఆరోగ్యం విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి. డబ్బు విషయంలో అయితే చెప్పక్కర్లేదు.. కొన్ని రాశుల వాళ్లకి కోట్లు కురిస్తే, ఇంకొందరికి మాత్రం కష్టాలు తప్పవు. మరి ఆ 138 రోజులు శని దేవుడి దయ వల్ల ఏయే రాశుల వాళ్ల జీవితాలు మారిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి (Virgo):
కన్యా రాశి వాళ్లకి శని దేవుడి దయ వల్ల ఈ టైమ్‌లో చాలా మంచి జరుగుతుందట. ముఖ్యంగా ఉద్యోగంలో అయితే తిరుగుండదు. మీరు ఎంత కష్టపడితే అంతకు తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీతో పనిచేసేవాళ్ల సపోర్ట్‌తో అనుకున్న లాభాలన్నీ అందుకుంటారట. అంతేకాదు, కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకి ఇది మంచి టైమ్. పెళ్లయిన వాళ్ల జీవితం అయితే పూలపాన్పులా ఉంటుందట. మీ భాగస్వామితో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు.
వృషభ రాశి (Taurus):
వృషభ రాశిలో పుట్టిన వాళ్లకి కూడా డబ్బు విషయంలో బాగా కలిసి వస్తుంది. శని తిరోగమనం వల్ల వీళ్ల జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయట. సమాజంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు కూడా బాగా వస్తాయి. వీళ్లు అదృష్టవంతులు కూడా అవుతారు. దీని వల్ల చాలా సమస్యల నుంచి బయటపడతారట. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. జీవితంలో ఆనందం, మంచి జరుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు.
మిధున రాశి (Gemini):
మీనరాశిలో శని వెనక్కి తిరగడం వల్ల మిధున రాశి వాళ్ల జీవితం కూడా చాలా బాగుంటుందట. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ద శుభవార్తలు కూడా వింటారట. డబ్బు పరిస్థితి కూడా ముందు కంటే చాలా మెరుగుపడుతుంది. పెళ్లయిన వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుంది, చాలా సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాదు, చాలా రకాల లాభాలు కలుగుతాయట. ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరికలు కూడా ఈ టైమ్‌లో నెరవేరుతాయి.
మొత్తానికి శని దేవుడు వెనక్కి తిరిగితే కొన్ని రాశుల వాళ్లకి మాత్రం తిరుగులేదు. డబ్బు, ఉద్యోగం, కుటుంబం.. అన్నింటా హ్యాపీగా ఉంటారు మరి.. మీ రాశి కూడా ఈ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి.