Real Estate Astrology: గురు గ్రహ అనుకూలతతో ఈ రాశుల వారికి ఇల్లు, వాహనం, ఆస్తులు ఖాయం!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో చతుర్థ స్థానం లేదా చతుర్థ స్థానాధిపతి అనుకూలంగా ఉండి, గృహ కారకుడైన గురు గ్రహం సహకరిస్తే సొంత ఇల్లు, వాహనం, ఆస్తిపాస్తులు సులభంగా లభిస్తాయి.

Update: 2025-08-14 17:03 GMT

Real Estate Astrology: గురు గ్రహ అనుకూలతతో ఈ రాశుల వారికి ఇల్లు, వాహనం, ఆస్తులు ఖాయం!

జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో చతుర్థ స్థానం లేదా చతుర్థ స్థానాధిపతి అనుకూలంగా ఉండి, గృహ కారకుడైన గురు గ్రహం సహకరిస్తే సొంత ఇల్లు, వాహనం, ఆస్తిపాస్తులు సులభంగా లభిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రహ సంచారం ప్రకారం వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకరం రాశుల వారికి ఈ యోగాలు బలంగా కనిపిస్తున్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతోనే ఇవి సాధించుకునే అవకాశం ఉంది.

వృషభం:

ఇల్లు, వాహనం, ఆస్తులు సంపాదించడం వీరి జీవితకాల కల. చతుర్ధాధిపతి రవి, గృహ కారక గురువు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది చివరి నాటికి కలలు నిజమవుతాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందే అవకాశం ఉంది.

మిథునం:

రాశ్యాధిపతి బుధుడు, సంపద కారక గురువు అనుకూలంగా ఉండటంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది.

సింహం:

ఆర్థిక భద్రత, స్థిర జీవనం కోసం కృషి చేసే వీరికి డిసెంబర్ 15లోపు సొంత ఇంటి కల సాకారం అవుతుంది. పొలాలు, స్థలాల మీద పెట్టుబడులు పెడతారు.

తుల:

గ్రహ బలం సహకరిస్తుండటంతో ఒకటికి రెండు ఇళ్లు సమకూర్చుకునే అవకాశం ఉంది. సహజ వ్యాపార ధోరణితో స్థలాలపై పెట్టుబడులు పెట్టడం, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించడం జరుగుతుంది.

ధనుస్సు:

ఆస్తులపై ఆసక్తి ఎక్కువ. ప్రస్తుత గ్రహ సంచారంతో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్‌లో గురు బలం కారణంగా గృహ, వాహన యోగాలు ఖాయం.

మకరం:

ఆర్థిక భద్రత, స్థిర నివాసం వీరి ప్రధాన లక్ష్యం. అక్టోబర్, నవంబర్‌లో ఉచ్ఛ గురు బలం తోడవడంతో సొంత ఇల్లు, వాహనం, స్థలాల కల నెరవేరుతుంది.

ఈ రాశుల వారికి వచ్చే నెలల్లో రియల్ ఎస్టేట్ కలలు నిజం కానున్నాయి.

Tags:    

Similar News