Parijat Raj Yog: 64 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాత యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్..
Parijat Raj Yog: ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
Parijat Raj Yog: 64 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాత యోగం.. ఈ రాశులకు బంపర్ జాక్ పాట్..
Parijat Raj Yog: ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈసారి అయితే, ఈ పర్వదినం మరింత విశేషంగా నిలవనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 64 ఏళ్ల తర్వాత ఈ ఏకాదశి రోజున అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది. జులై 6, ఆదివారం నాడు జరిగే ఈ ప్రత్యేక యోగం ప్రభావం పన్నెండు రాశులపైనా పడనుంది.
ఈరోజు నుంచే చాతుర్మాస్య దీక్ష కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా, పారిజాత యోగం ఏర్పడే కారణంగా శ్రీమహావిష్ణువుకు పారిజాత పువ్వులు సమర్పించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధనప్రాప్తి, సమాజంలో గౌరవం, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, కోర్టు వ్యవహారాల్లో విజయం, పెళ్లిసంబంధాలు కుదిరే అవకాశాలు ఏర్పడతాయంటున్నారు.
అంతేకాదు, సోదరులతో సఖ్యత, సంతాన సంబంధిత శుభవార్తలు కూడా వింటారు. రియల్ ఎస్టేట్, భూ కొనుగోలు, బంగారం పెట్టుబడుల్లో లాభాలు దక్కుతాయి. ఇప్పటికే ఉన్న ఆస్తుల్ని లాభదాయకమైన రంగాల్లో ఇన్వెస్ట్ చేసి మళ్లీ ఆదాయ మార్గాలు తెరుస్తారు.
ఈ ఏకాదశి రోజున పారిజాత పువ్వులు శ్రీమహావిష్ణువుకు సమర్పిస్తే, దైవ అనుగ్రహంతో జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయని, ఆకస్మికంగా కొత్త అవకాశాలు వస్తాయని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తున్నారు.