Nava Panchama Yoga: 14 ఏళ్ల తర్వాత కోటీశ్వర యోగం.. ఈ రాశికి అపూర్వ పురోగతి, అదృష్టానికి మారుపేరు

Nava Panchama Yoga 2025: ఏప్రిల్ 20వ తేదీ నుంచి నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు శుభయోగం. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి.

Update: 2025-04-15 00:30 GMT

Nava Panchama Yoga: 14 ఏళ్ల తర్వాత కోటీశ్వర యోగం.. ఈ రాశికి అపూర్వ పురోగతి, అదృష్టానికి మారుపేరు

Nava Panchama Yoga 2025: గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశి మార్చినప్పుడు కొన్ని యోగాలు ఏర్పరుస్తాయి. ఆ సమయంలో కొన్ని రాశులకు శుభాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు అశుభాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి అంగారక గ్రహం, వరుణుడితో కలిసి నవ పంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీంతో ఈ రాశులకు నక్కతోక తొక్కినంత అదృష్టం కలిసి వస్తుంది.

అయితే ఈ నవ పంచమ యోగంతో అదృష్టం, పురోగతి, ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రధానంగా వీళ్లకు కొత్త అవకాశాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాశులు ఏమున్నాయో తెలుసుకుందాం. కుజుడు వరుడు ఒకే రాశిలో కలవడం వల్ల ఈ నవ పంచమ యోగం ఏర్పడుతుంది.

కన్య రాశి..

నవ పంచమ యోగం వల్ల కన్యరాశి వారి సుడి తిరిగినట్లే. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కన్యా రాశి వారు అశేష లాభాలు కూడా పొందుతారు. ఈ యోగం వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా బాగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. జీవితంలో ప్రతిదీ సాధించే సమయం.

తులారాశి..

నవ పంచమా రాజయోగం వల్ల తులా రాశి వారికి కూడా ఉద్యోగంలో పదోన్నతి కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రధానంగా వీళ్ల వ్యాపారాలు విస్తరిస్తాయి. దీంతో వీళ్ళకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు కూడా పొందుతారు.

కర్కాటక రాశి

నవ పంచమ యోగం వల్ల కర్కాటక రాశి వారికి కూడా కుటుంబంలో వివాదాలు సద్దుమణువుతాయి. అంతే కాదు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు, వీరికి ఆకస్మిక ధనలాపం కూడా కలిసి వస్తుంది.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu దీన్ని ధృవీకరించలేదు. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించండి)

Tags:    

Similar News