Mystery Temple: ఈ ఆలయంలో జంటలు కలిసి పూజలు చేయకూడదు.. ఎందుకో తెలుసా.?
భారతదేశం ఎన్నో సంప్రదయాలకు, ఆచారాలకు పెట్టింది పేరు.
Mystery Temple: ఈ ఆలయంలో జంటలు కలిసి పూజలు చేయకూడదు.. ఎందుకో తెలుసా.?
Mystery Temple: భారతదేశం ఎన్నో సంప్రదయాలకు, ఆచారాలకు పెట్టింది పేరు. ప్రతీ రాష్ట్రంలో విభిన్నమై నమ్మకాలు కనిపిస్తాయి. ఇక ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. ఇలాంటి ఆలయాల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రై కోటి మాత దేవాలయం ఒకటి. ఇది సిమ్లా జిల్లా రాంపూర్ తహసీల్‌లో ఉన్న ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో భర్త, భార్య కలిసి పూజలు చేయడం నిషిద్ధం. దీనివెనకాల ఉన్న అసలు కారణ ఏంటి.? ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించిన కథ పురాణం ఇలా ఉంది.
పురాణ గాధ:
ఒకసారి శివుడు, పార్వతి దేవి తమ ఇద్దరు కుమారులైన గణేశుడు, కార్తికేయుడిని విశ్వ యాత్రకు పంపారు. అయితే గణేశుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి, “తల్లిదండ్రులే విశ్వం” అని తెలిపాడు. ఇది గణపతికి ఘనత తీసుకొచ్చింది. తరువాత అతడు వివాహం కూడా చేసుకున్నాడు.
కానీ కార్తికేయుడు మాత్రం వివాహం వద్దని తేల్చాడు. ఈ నిర్ణయంతో తల్లి పార్వతీ దేవి కలత చెంది, "నా కొడుకు వివాహం చేసుకోలేడు కాబట్టి, ఈ ప్రదేశంలో భర్తభార్యలు కలిసి పూజిస్తే వారి మధ్య దూరం ఏర్పడుతుంది" అని శపించింది. అప్పటి నుంచి ఈ ఆలయంలో భార్యాభర్తలు కలసి పూజలు చేయరని నమ్మకం బలంగా ఉంది. ఈ నమ్మకాన్ని నేటికీ పాటిస్తున్నారు.
భక్తుల నమ్మకం:
అయినా కూడా వివాహితులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అయితే కలిసి కాకుండా విడివిడిగా పూజలు చేస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం, కలసి పూజిస్తే అనర్థం జరుగుతుందని భయంతోనే వారు ఇలా వ్యవహరిస్తారు.
ఒకవైపు జంటగా పూజించడం నిషిద్ధం అనే నిబంధన ఉన్నా, ఆలయం ప్రవేశద్వారంలో గణపతి దేవుడు తన సతీమణితో ఉన్న విగ్రహం మాత్రం దర్శనమిస్తుంది. నవరాత్రుల సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.