Moon And Rahu Yuti 2025: రాహువు చంద్రుడి కలయికతో మేషం సహా ఈ 5 రాశులకు అదృష్టం తలుపు తట్టనుంది!
Moon And Rahu Yuti 2025: 2025 జూన్ 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:09 గంటలకు చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించి రాహువుతో కలిసి గ్రహణ యోగాన్ని ఏర్పరించబోతున్నాడు.
Moon And Rahu Yuti 2025: రాహువు చంద్రుడి కలయికతో మేషం సహా ఈ 5 రాశులకు అదృష్టం తలుపు తట్టనుంది!
రాహువు, చంద్రుడి కలయికతో మేషం సహా ఏయే రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలయిక చాలా ముఖ్యమైనది. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఇది బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక విషయాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
2025 జూన్ 16న మధ్యాహ్నం 1:09 గంటలకు చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడే రాహువుతో కలిసి గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి చాలా మంచి జరుగుతుంది. వారేంటో ఇప్పుడు చూద్దాం:
మేష రాశి:
మీ రాశి నుంచి పదకొండో స్థానంలో ఈ కలయిక జరుగుతుంది. దీని వల్ల మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అన్నదమ్ములు, స్నేహితుల సపోర్ట్ మీకు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
వృషభ రాశి:
మీ రాశి నుంచి పదో స్థానంలో రాహువు, చంద్రుడు కలవడం వల్ల కెరీర్ పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆస్తుల విషయంలో కూడా లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి:
మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఈ కలయిక జరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది.
కన్య రాశి:
మీ రాశి నుంచి ఆరో స్థానంలో రాహువు, చంద్రుడు కలవడం వల్ల చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో మీరు గెలుస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ సహోద్యోగుల నుంచి మీకు సహాయం అందుతుంది. అయితే తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయండి.
ధనస్సు రాశి:
మీ రాశి నుంచి మూడో స్థానంలో ఈ కలయిక జరుగుతుంది. దీని వల్ల మీరు చిన్న ప్రయాణాలు చేస్తారు. మీ నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.