Marriage Astrology: శ్రావణ మాసంలో శుభయోగం.. ఈ రాశుల వారికి పెళ్లి పీటలు ఎక్కే అవకాశం!
Marriage Astrology: హిందూ పంచాంగ ప్రకారం జూలై 25న ప్రారంభమయ్యే శ్రావణ మాసం, ఆగస్టు 23వరకూ కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో శుక్రుడు, గురు గ్రహాల అనుకూలత కొంతమంది రాశులవారికి పెళ్లి యోగాన్ని కలిగిస్తోంది.
Marriage Astrology: శ్రావణ మాసంలో శుభయోగం.. ఈ రాశుల వారికి పెళ్లి పీటలు ఎక్కే అవకాశం!
Marriage Astrology: హిందూ పంచాంగ ప్రకారం జూలై 25న ప్రారంభమయ్యే శ్రావణ మాసం, ఆగస్టు 23వరకూ కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో శుక్రుడు, గురు గ్రహాల అనుకూలత కొంతమంది రాశులవారికి పెళ్లి యోగాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం రాశుల వారికి ఈ శ్రావణం ఎంతో అనుకూలంగా ఉండే అవకాశముంది.
వివాహ, ప్రేమ, దాంపత్య సంబంధాల కారకుడైన శుక్రుడు ఆగస్టు 26వరకూ స్వరాశియైన వృషభంలో సంచరిస్తున్నాడు. శుభకార్యాల పాలకుడైన గురుడు 2026 జూన్ 2వరకూ మిథున రాశిలో గోచరిస్తూ శుభ ఫలితాల్ని ఇస్తున్నాడు.
మేష రాశి:
శుక్రుడు ద్వితీయ స్థానంలో, గురుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉండటంతో బంధువులు లేదా స్నేహితుల సహకారంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు విజయవంతమవుతాయి. సంపన్న కుటుంబంతో శుభవివాహం జరగనుంది.
వృషభ రాశి:
శుక్రుడు రాశ్యాధిపతిగా స్వరాశిలో ఉండటం, గురువు కుటుంబ స్థానంలో సంచరిస్తుండటంతో ఈ రాశివారికి నిరూపద్రవంగా పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రేమ లేదా కుటుంబ సమ్మతితో వివాహం జరగవచ్చు.
కర్కాటక రాశి:
లాభస్థానంలో స్వరాశిలో ఉన్న శుక్రుడు కళత్రయోగాన్ని కలిగిస్తున్నాడు. విదేశీ సంబంధం లేదా సహోద్యోగితో పెళ్లి కుదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైభవంగా వివాహం జరగే అవకాశం ఉంది.
కన్య రాశి:
భాగ్యస్థానంలో శుక్రుడు, దశమస్థానంలో గురువు సంచారం వల్ల, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశముంది. సొంత ఊరిలో, సంప్రదాయబద్ధంగా పెళ్లి జరగవచ్చు. ప్రేమ వివాహం కూడా కుదిరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
సప్తమస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశివారు కొద్దిపాటి ప్రయత్నంతోనే శుభవార్త వింటారు. కులాంతర వివాహం లేదా ప్రేమ వివాహం జరిగే అవకాశాలున్నాయి. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి జరగవచ్చు.
మకర రాశి:
పంచమస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల, ప్రేమ జీవితం పెళ్లి వైపు దారి తీస్తుంది. పరిచయస్థులతో సంబంధం పెళ్లికి దారితీస్తుంది. తక్కువ సమయం లోనే పెళ్లి కుదిరే అవకాశముంది. పెళ్లి ఖర్చులు ఆశించినదానికంటే ఎక్కువ కావచ్చు.