Astrology: లక్ష్మీనారాయణ యోగంతో ఈ 3 రాశుల వారికి మంచి రోజులు.. పండగ చేస్కోండి
Astrology: జ్యోతిష్యంలో గ్రహ స్థితులు ఎన్నో రకాల యోగాలను ఏర్పరుస్తాయి. వాటిలో లక్ష్మీ నారాయణ యోగం ఒక ప్రత్యేకమైనది. ఈ యోగం బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడుతుంది.
Astrology: లక్ష్మీనారాయణ యోగంతో ఈ 3 రాశుల వారికి మంచి రోజులు.. పండగ చేస్కోండి
Astrology: జ్యోతిష్యంలో గ్రహ స్థితులు ఎన్నో రకాల యోగాలను ఏర్పరుస్తాయి. వాటిలో లక్ష్మీ నారాయణ యోగం ఒక ప్రత్యేకమైనది. ఈ యోగం బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఇవి సంపద, విద్య, బుద్ధి, సౌందర్యం, విలాసవంతమైన జీవితం వంటి అంశాలకు ప్రతినిధులుగా భావిస్తారు.
ఈ సంవత్సరం ఆగష్టు 28వ తేదీన కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు కలవబోతున్నారు. అదే సమయంలో చంద్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల ఈ యోగం మరింత శక్తివంతంగా మారనుంది. ఈ సమయాన్నే లక్ష్మీ నారాయణ యోగం పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అరుదైన ఆర్థిక అవకాశాలు, జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
వృషభ రాశి (Taurus)
ఈ రాశివారికి లక్ష్మీ నారాయణ యోగం ధనవంతులను చేస్తుంది. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలలో వృద్ధి, ఉద్యోగాలలో ప్రమోషన్ వంటి అనేక మంచి ఫలితాలు రావొచ్చు. పెళ్లి విషయంలో ఎదురుచూస్తున్న వారికి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. జీతాలు, ఆదాయ మార్గాలు మెరుగవుతాయి.
వృశ్చిక రాశి (Scorpio)
ఇతరుల కంటే ఈ యోగం ప్రభావం వృశ్చిక రాశివారిపై బలంగా ఉంటుంది. మీ ముందున్న అవకాశాలు అనుకోని రీతిలో పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబ వారసత్వంగా వచ్చే ఆస్తులు, లాభాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రతి నిర్ణయం విజయవంతం కావడమే కాక, పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది.
మీన రాశి (Pisces)
ఈ రాశి వారు ఏళ్ల నుంచి పడుతోన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించనుంది. చేస్తున్న పనుల్లో విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ మార్పు, కొత్త వ్యాపారం మొదలు పెట్టే వారు మంచి స్థిరత్వాన్ని పొందుతారు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే వారికి లాభదాయక సమయంగా చెప్పొచ్చు.