మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు.. ఈ మూడు రాశులకు డబ్బు, వాహనాలు, అదృష్టం ఇలా ఎన్నో!
Ketu will enter Purvabhadra Nakshatra: కేతువు, తిరోగమన శక్తులు కలిగిన నీడగ్రహం, జూలై 6వ తేదీ మధ్యాహ్నం 1:32 గంటలకు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం జూలై 20వ తేదీ మధ్యాహ్నం 2:10 గంటల వరకు కొనసాగుతుంది.
మరో నాలుగు రోజుల్లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి కేతువు.. ఈ మూడు రాశులకు డబ్బు, వాహనాలు, అదృష్టం ఇలా ఎన్నో!
Ketu will enter Purvabhadra Nakshatra: కేతువు, తిరోగమన శక్తులు కలిగిన నీడగ్రహం, జూలై 6వ తేదీ మధ్యాహ్నం 1:32 గంటలకు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం జూలై 20వ తేదీ మధ్యాహ్నం 2:10 గంటల వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో 12 రాశులపై ప్రభావం చూపినా, మూడు రాశులవారికి ప్రత్యేక లాభాలు చేకూరనున్నాయి.
ఈ మూడు రాశులవారు ఈ కాలంలో ఆర్థిక, వ్యక్తిగత, వృత్తిపరంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు, నిలకడైన ఆదాయం, అంతర్గత శక్తి అభివృద్ధి వంటి అనేక దారులు తెరుచుకుంటాయి.
1. వృషభ రాశి
కేతువు సంచారం వృషభ రాశివారికి నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆఫీసులో గౌరవం, గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా నెదుర్కొంటున్న సమస్యలు ఈ కాలంలో పరిష్కారమవుతాయి.
పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నవారికి ఇదొక శుభకాలం. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
2. కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. పేరు, ప్రఖ్యాతి పెరుగుతుంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ రంగంలో గుర్తింపు లభించనుంది. సంపాదనకు మంచి అవకాశాలు వస్తాయి. ఆనందంగా గడిపే కాలంగా ఇది నిలుస్తుంది.
3. తులా రాశి
తులా రాశివారికి ఈ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. స్పష్టమైన ఆలోచనలతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. జీతాల్లో పెరుగుదల ఆశించవచ్చు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వాహనాల కొనుగోలు వంటి ముఖ్యమైన నిర్ణయాలకు ఇది అనుకూల సమయం.
గమనిక: ఈ విషయాన్ని పంచాంగాలు, జ్యోతిస్య పండితులు చెప్పిన దాన్నే మీకు అందించాము. సనాతన హిందూ సంప్రదాయంలో నవగ్రహాల కదలిక ఆధారంగా ఇవ్వబడింది. hmtv దీన్ని ధృవీకరించడం లేదు.