Horoscope Today: లాభంతో కూడిన ప్రయాణాలు వీరి సొంతం..!

Horoscope Today: లాభంతో కూడిన ప్రయాణాలు వీరి సొంతం..!

Update: 2024-05-10 00:30 GMT

Horoscope Today: లాభంతో కూడిన ప్రయాణాలు వీరి సొంతం..!

(10-05-2024, శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, శుక్ల పక్షం,

తిధి : తదియ (మే 11వ తేదీ తె.వా. గం.2.50 ని.ల వరకు)

నక్షత్రం: రోహిణి ఉదయం గం. 10.47 ని.ల వరకు., ఆ తర్వాత మృగశిర

అమృతఘడియలు: ఉదయం గం.7.44 ని.ల నుంచి గం.9.15 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి గం.1.39 ని.ల నుంచి మే 11వ తేదీ తె.వా. గం. 3.13 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.4.15 ని.ల నుంచి గం.5.49 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.21 నిల. నుంచి గం.9.12 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.38 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.36 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.13 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.46 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.39 ని.లకు

ఇవాళ్టి విశేషం : అక్షయ తృతీయ


మేషం : వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. పనులు అనుకున్నట్లుగా సాగవు. బ్యాంకు లావాదేవీలు వాయిదా పడతాయి. విరోధులు పెరుగుతారు. కుటుంబంలోనూ చికాకులుంటాయి. పరాశక్తిని పూజించండి.


వృషభం : నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారు. కీలక వ్యవహారాలలో రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలాకాలంగా ఊరిస్తున్న సమాచారం అందుతుంది. మానసిక దృఢత్వం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం జాగ్రత్త.


మిథునం : ఇంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. బంధువుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అదుపు చేయాలి. అద్దెకున్న వారికి యజమానితో సమస్యలుంటాయి.


కర్కాటకం: వేసుకున్న అంచనాలు తప్పుతాయి. నిరాశ కలుగుతుంది. తెలివితేటలకు గుర్తింపు లభించలేదన్న చింత ఉంటుంది. అనుమానాలు వీడండి. ఆత్మధైర్యంతో పనులు చేయండి. భగవదనుగ్రహం తోడవుతుంది.


సింహం: చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. బ్యాంకు రుణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రులు తోడుగా ఉంటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


కన్య : కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి అనువైన రోజు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.


తుల : పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. శత్రువులు బలపడతారు. తగదాలకు దూరంగా ఉండండి. వృథా ఖర్చులు తగ్గించండి. అనూహ్య బహుమతిని అందుకుంటారు. తొందరపాటు వల్ల సమస్యలొస్తాయి.


వృశ్చికం : ఆలోచనలు సమున్నతంగా సాగుతాయి. విద్య, వృత్తుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. సంతానంతో విరోధం ఉంది.


ధనుస్సు : బాధ్యతల నిర్వహణ సక్రమంగా సాగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. జీవన ప్రమాణం పెరుగుతుంది. సంతానానికి సంబంధించి శుభ వర్తమానం అందుతుంది. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.


మకరం : అభీష్టం నెరవేరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. మిత్రులు తోడుగా ఉంటారు. విందుల్లో పాల్గొంటారు. శుభ కార్యాల గురించి కుటుంబంతో చర్చిస్తారు. పెద్దల హితవచనాలు పాటించండి.


కుంభం: మీ తొందరపాటు వల్ల రహస్యాలు బయటపడతాయి. మనసు కలతబారుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. మిత్రులతోనూ సఖ్యత చెడే సూచన ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. బద్ధకాన్ని వదలండి.


మీనం : అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వినదాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతి ఉంటుంది.

Tags:    

Similar News