Dhanteras 2025: రాశుల ప్రకారం ఏ రాశివారికి ఏ వస్తువులు కొనుగోలు మంచిది?
ధన్ త్రయోదశి (Dhanteras) 2025 ఈ సంవత్సరం అక్టోబర్ 18న వస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందువులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు
Dhanteras 2025: రాశుల ప్రకారం ఏ రాశివారికి ఏ వస్తువులు కొనుగోలు మంచిది?
ధన్ త్రయోదశి (Dhanteras) 2025 ఈ సంవత్సరం అక్టోబర్ 18న వస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి హిందువులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనేక మంది బంగారం, వెండి, చీపుర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు. అన్నదానం చేయడం, యమదీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వాసం ఉంది.
రాశుల ప్రకారం ధన్ తేరాస్ రోజున ఏ వస్తువులు కొనుగోలు చేయాలో వివరాలు:
మేషరాశి: బంగారం లేదా ఎర్రటి వస్తువులు కొనుగోలు చేయడం మంచిది.
వృషభరాశి: వెండి, సిల్వర్ కాయిన్స్, ఆభరణాలు కొనుగోలు చేయండి.
మిధున రాశి: పుస్తకాలు, స్టేషనరీ, గాడ్జెట్లు; అవసరమైతే బంగారు ఆభరణాలు లేదా కాయిన్స్.
కర్కాటక రాశి: వంటింటి వస్తువులు, ముఖ్యంగా రాగి లేదా కాంస్య వస్తువులు.
సింహ రాశి: బంగారం, ఆభరణాలు, కాయిన్స్.
కన్య రాశి: ఆరోగ్యం, శుభ్రతకి సంబంధించిన వస్తువులు.
తులా రాశి: వెండి ఆభరణాలు.
వృశ్చిక రాశి: బంగారు కాయిన్స్, ఆభరణాలు, ఎర్రటి వస్తువులు.
ధనుస్సు రాశి: చదువు, ట్రావెల్ సంబంధిత వస్తువులు.
మకరరాశి: మెటల్స్, గృహోపకరణాలు.
కుంభరాశి: గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వెండి ఆభరణాలు, కాయిన్స్.
మీనరాశి: బంగారం, నీటికి సంబంధించిన డెకర్ వస్తువులు.
గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఉంది. పాఠకులు వ్యక్తిగతగా పరిశీలించి, అవసరమైతే మాత్రమే అనుసరించాలి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.