Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/3/2025)

Daily Horoscope Today In Telugu, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-06 18:45 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: మృగశిర రాత్రి గం.11.32 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.56 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.53 ని.ల నుంచి గం. 9.41 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 గం.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.30 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు

మేషం 

అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజిది. అన్ని రకాల లబ్దిని పొందుతారు. సోదరులు తోడుగా నిలుస్తారు. వృత్తిపర నైపుణ్యాలతో బాగా రాణిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మధైర్యం పెరుగుతుంది.

వృషభం 

మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయాలి. నోటిదరుసును తగ్గించుకోవాలి. బ్యాంకు లావాదేవీలు పెద్దగా తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బందులుంటాయి. ఖర్చు తగ్గించాలి.

మిథునం 

ఉన్నత స్థాయికి ఎదగాలన్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటూ సాగాలి. అదృష్టం కలిసొస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందుకు హాజరవుతారు.

కర్కాటకం

ఇంటికి దూరంగా ఒంటరిగా గడిపే సూచన ఉంది. పనులు ఆశించినట్లు సాగవు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు.

సింహం 

ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. మీ ప్రయత్నాలకు తగిన సపోర్ట్ అందుతుంది. కొత్త స్నేహాలు లాభిస్తాయి. కీలక ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది.

కన్య 

నైపుణ్యానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఉన్నత స్థాయిలోని వారు అండగా నిలుస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచనలు ఉన్నాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు.

తుల 

పనులు అనుకున్నట్లుగా సాగవు. అశాంతి పెరుగుతుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. ఖర్చు తగ్గించాలి. అనవసరంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. భవిష్యత్‌పై బెంగ ఉంటుంది.

వృశ్చికం 

బలహీనతలే దెబ్బ తీస్తాయి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పెద్దల కోపానికి గురవుతారు. వేళకు భోజనముండదు. ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అజీర్తి సమస్య ఉంటుంది.

ధనుస్సు 

ధనలాభముంది. బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయమిది. ప్రయాణ ప్రయోజనం సిద్ధిస్తుంది.

మకరం 

అభీష్టం నెరవేరుతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. వివాదం పరిష్కారమవుతుంది. అనుబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం 

బద్ధకం వదిలిపెట్టాలి. ఇష్ట కార్యం చెడిపోయే సూచన ఉంది. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. విశ్లేషణలు పనికి రావు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవలు వస్తాయి.

మీనం 

ఆలోచనల తీరును మార్చుకోవాలి. వాహన సంబంధ సమస్య గోచరిస్తోంది. స్థిరాస్తి, విద్యా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి నిలకడగా లేక బంధువులతో గొడవలకు దిగుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Tags:    

Similar News