Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/3/2025)
Daily Horoscope Today In Telugu, March 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం
తిధి: సప్తమి ఉదయం గం.10.50 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి
నక్షత్రం: రోహిణి ఇవాళ్టి అర్ధరాత్రి గం.12.05 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర
అమృతఘడియలు: రాత్రి గం.9.02 ని.ల నుంచి గం.10.34 ని.ల వరకు
వర్జ్యం: సాయంత్రం గం.4.26 ని.ల నుంచి గం.5.58 ని.ల వరకు మళ్లీ రేపు తె.వా. గం.5.33 ని.ల నుంచి ఉదయం గం.7.07 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.10.29 ని.ల నుంచి గం.11.16 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.31 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు
మేషం
కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపాలి. విడాకులు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఇవాళ అనుకూలించవు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. కార్యనిర్వహణలో నిజాయితీతో ఉండండి. గొడవలకు దిగకండి.
వృషభం
రోజంతా శుభప్రదంగా సాగుతుంది. శారీరక, మానసిక సౌఖ్యాలను ఆస్వాదిస్తారు. విందుల్లో పాల్గొంటారు. ధన లాభముంది. గౌరవం పెరుగుతుంది. తెలివితేటలు రాణిస్తాయి. వాహనయోగం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం
పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక లావాదేవీలు కూడా ఏమాత్రం సంతృప్తినివ్వవు. దిగులు కలుగుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. మిత్రుల వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. గొడవలు వస్తాయి.
కర్కాటకం
ఆదాయం మెరుగవుతుంది. కోరిక నెరవేరుతుంది. ఇతరుల నుంచీ తగిన సహకారం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారిని కలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
సింహం
అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగుతాయి. కొత్త బాధ్యతలను చేపట్టే సూచన ఉంది. అవకాశాన్ని పాడు చేసుకోకండి. ప్రత్యర్థులను జయిస్తారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. స్థిరనివాస యత్నం ఫలిస్తుంది.
కన్య
న్యాయపరమైన చిక్కులు వచ్చే వీలుంది. కోర్టు, పోలీసు వ్యవహారాల్లో జాగ్రత్త. సంతానం వల్ల శాంతి ఉండదు. గురు సమానులతో భేటీ అవుతారు. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. దైవక్షేత్ర సందర్శన గోచరిస్తోంది.
తుల
అన్ని వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. వృథా ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి.
వృశ్చికం
ఆకాంక్ష నెరవేరుతుంది. అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తారు. స్వేచ్ఛాజీవితంపై కోరిక పెరుగుతుంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణం లాభిస్తుంది.
ధనుస్సు
అపార్థాలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అదృష్టం తోడుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది.
మకరం
ఇష్టకార్యం భంగమయ్యే సూచన ఉంది. అనవసర జోక్యాల వల్ల విరోధం పెరుగుతుంది. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి. మీ సలహాలకు విలువ ఉండదు. విచారం కలుగుతుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి.
కుంభం
సమర్థించిన వారే ప్రతికూలంగా మారే సూచన ఉంది. మనసు నిలకడగా ఉండదు. ధన సంబంధ అంశాలూ చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఇవాళ స్థిరాస్తి లావాదేవీలు వద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం
వ్యవహార జయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. సహచరులు సహకరిస్తారు. ఆర్థికలబ్దిని పొందుతారు. ఆత్మ ధైర్యం పెరుగుతుంది. నాయకత్వ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కీలక కమ్యూనికేషన్ అందుతుంది.