Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (5/3/2025)

Daily Horoscope Today In Telugu, March 5, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-04 19:58 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, March 5, 2025

నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం

తిధి: షష్ఠి మధ్యాహ్నం గం. 12.51 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: కృత్తిక అర్ధరాత్రి దాటాక గం.1.08 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: రాత్రి గం.10.53 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.23 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం. 1.53 ని.ల నుంచి గం.3.23 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.04 ని.ల నుంచి గం.12.51 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.32 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు

మేషం 

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపాలి. ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా బ్యాంకు విషయాలు అనుకూలంగా ఉండవు. అనవసర గొడవలకు ఆస్కారం ఉంది. వేళకు భోజనం ఉండదు. విలువైన వస్తువులు జాగ్రత్త.

వృషభం 

తెలివితేటలకు గుర్తింపును పొందుతారు. విద్యారంగంలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. విందుకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

మిథునం 

అనవసర విషయాల్లో జోక్యం వద్దు. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక నష్టం గోచరిస్తోంది. ప్రయాణం వల్ల ప్రయోజనం ఉండదు.

కర్కాటకం

శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు.

సింహం 

ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. అన్ని పనులూ విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన రీతిలోనే ఉంటాయి. ఉన్నత పదవిలోని వారి సహకారం లభిస్తుంది. సమర్థతను చాటుకుంటారు.

కన్య 

పనులకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తికరంగా ఉండవు. సంతానం తీరు అశాంతికి గురి చేస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు.

తుల 

ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. పోటీల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే సూచన ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

వృశ్చికం 

లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థికలబ్దిని పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణ ప్రయోజనాన్ని పొందుతారు.

ధనుస్సు 

వేధిస్తున్న కష్టం తీరిపోతుంది. వివాదం పరిష్కారం అవుతుంది. ధనలాభం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతిష్ట పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

మకరం 

సంతానం వైఖరి చికాకు తెప్పిస్తుంది. పనులకు ఆటంకాలుంటాయి. బద్ధకం వదలండి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది.

కుంభం 

బుద్ధి స్థిరంగా ఉండదు. అనవసర గొడవలకు ఆస్కారముంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృథా ఖర్చులను తగ్గించాలి. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది.

మీనం 

వ్యవహారాల్లో విశేష లాభం ఉంది. ధనాదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందపరుస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. సహచరులతో సఖ్యత పెరుగుతుంది.

Tags:    

Similar News