Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/1/2025)

Daily Horoscope Today In Telugu, January 28, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-27 19:18 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/1/2025)

Daily Horoscope Today In Telugu, January 28, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.


మేషం 

కొంత అసంతృప్తి ఉన్నా.. పనులు సవ్యంగానే సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. పోటీల్లో గెలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సంతానం గురించిన శ్రద్ధ అవసరం.

వృషభం 

తొందరపాటు వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది. ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. అనవసర పోటీల్లో పాల్గొనకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మిథునం 

కష్టానికి తగ్గ ఫలితం లభించదు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. తగాదాలకు ఆస్కారముంది. చెప్పుడు మాటలను నమ్మకండి. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి.

కర్కాటకం

ఆకాంక్ష నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహం 

ఆటంకాలను తేలిగ్గానే దాటేస్తారు. తలచిన కార్యాన్ని సాధించుకుంటారు. సమస్య పరిష్కారం అవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువులను కలుస్తారు.

కన్య 

పనులు ఆశించిన రీతిలో సాగవు. ఆలోచన విధానాన్ని మార్చుకుని ఒత్తిడిని అదుపు చేయాలి. అవసరానికి తగినంత డబ్బు అందుతుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. రక్తసంబంధీకుల సమాచారం అందుతుంది.

తుల 

కార్యసాధనలో జాప్యం ఏర్పడుతుంది. కీలక సమాచారం అందుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. ప్రయాణం లాభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఆశించినట్లు సాగవు. బంధువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

వృశ్చికం 

వ్యవహారలాభం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కీలక వ్యవహారంలో సాహసభరిత నిర్ణయం తీసుకుంటారు. సోదరుల తోడ్పాటు లభిస్తుంది. మధ్యవర్తిత్వ బాధ్యతలు తీసుకోకండి.

ధనుస్సు 

పనులు అనుకున్నంత తేలిగ్గా సాగవు. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. కీలక వేళ అదృష్టం తోడుంటుంది.

మకరం 

ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. కీర్తి పెరుగుతుంది. బాల్య స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. భారీగా నష్టపోయే వీలుంది.

కుంభం 

ఉల్లాసంగా సాగుతుంది. ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మిత్రులతో విందుకు హాజరవుతారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. పెద్దల మన్ననలను పొందుతారు. ప్రయాణం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

మీనం 

రోజంతా ఆనందంగా గడుపుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులు పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. సంతానం విషయాలు తృప్తినిస్తాయి.

Tags:    

Similar News