Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (27/1/2025)

Daily Horoscope Today In Telugu, January 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-01-26 18:45 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (27/1/2025)

Daily Horoscope Today In Telugu, January 27, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

మేషం

పనులు సవ్యంగా సాగవు. అశాంతి కలుగుతుంది. తండ్రి తీరును విభేదిస్తారు. కొత్త ప్రదేశానికి వెళతారు. గురు సమానులను కలుస్తారు. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం మంచిది కాదు.

వృషభం 

వారసత్వపు ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలను నమ్మకండి. చెడుదారుల్లో వెళ్లకండి. అపోహలు తొలగించుకోండి. అనవసర పోటీలకు దిగకండి. అనూహ్య ఖర్చులుంటాయి. జీర్ణ, కీళ్ల సమస్యలు ఉంటాయి.

మిథునం 

అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. వాహన యోగం ఉంది. విందులో పాల్గొంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

కర్కాటకం

అపార్థాలు తొలగిపోతాయి. అందరి నుంచీ సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తిగా సాగుతాయి.

సింహం 

కార్యసాధనకు అడ్డంకులొస్తాయి. బద్ధకం వీడి కష్టిస్తే ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. విరోధానికి అవకాశం ఉంది. సమర్థతకు తగ్గ గుర్తింపు ఉండదు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చు తగ్గించండి.

కన్య 

మనసు నిలకడగా ఉండదు. పనులు ఆశించిన రీతిలో సాగవు. బంధుమిత్రులతో విరోధం గోచరిస్తోంది. కుటుంబం గురించి శ్రద్ధ పెట్టండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. వృథా ఖర్చులు తగ్గించండి. స్థిరాస్తి లావాదేవీలు వద్దు.

తుల 

ప్రయత్నాలన్నీ శుభ ఫలితాలనిస్తాయి. సాహసోపేత నిర్ణయం తీసుకుంటారు. సోదరుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఉంటుంది. కీలక సమాచారం మనశ్శాంతినిస్తుంది.

వృశ్చికం 

బ్యాంకు లావాదేవీల్లో అజాగ్రత్త వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇతరుల కారణంగా సమస్యలొస్తాయి. ఇతర ప్రయత్నాలకూ విఘ్నాలుంటాయి. అకారణంగా విరోధాలకు దిగకండి. నిజాయితీగా పని చేసుకుంటూ వెళ్లండి.

ధనుస్సు 

రోజంతా ఉల్లాసంగా సాగుతుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. విందుల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాల్యస్నేహితులను కలుస్తారు.

మకరం 

పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. దూర ప్రయాణం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు. పోటీల్లో నష్టపోతారు. మిత్రుల సహకారం లభించదు. నిద్రలేమి వేధిస్తుంది.

కుంభం 

అభీష్టం నెరవేరుతుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక చికాకులు ఉండవు. నూతన విజ్ఞాన సముపార్జనకు అనుకూలం. పెద్దలతో ఫలవంతమైన చర్చ ఆనందాన్ని పెంచుతుంది. విందుకు హాజరవుతారు.

మీనం 

అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కృషికి తగ్గ అవకాశాలు లభిస్తాయి. విందుకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.

Tags:    

Similar News