Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (8/2/2025)
Daily Horoscope Today In Telugu, February 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, February 8, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.)
మేషం
లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో ఆర్థిక లబ్దిని పొందుతారు. పక్షపాతం లేని స్వభావానికి ప్రశంసలు అంతుదాయి. ప్రయాణం లాభిస్తుంది. సమాచార రంగంలోని వారికి బావుంటుంది.
వృషభం
మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక వ్యవహారాల్లో నష్టపోతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. పూచీలు ఇవ్వకండి. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించాలి. నిజాయితీగా ఉండండి. కంటి సమస్య వుంటుంది.
మిథునం
జీవితంలో ఎదగాలనే కోరిక బలపడుతుంది. ఆ దిశగా ప్రణాళికలను రూపొందిస్తారు. మిత్రుల సహకరిస్తారు. కొత్తవిషయాలు తెలుస్తాయి. వాహన యోగం ఉంది. కుటుంబసౌఖ్యాన్ని పొందుతారు. గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం
ప్రయత్నాలు ఫలించవు. తొందరపాటు చర్యల వల్ల మిత్రులతో విరోధం ఏర్పడే వీలుంది. ఇతరుల విషయంలో జాగ్రత్త. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. అనవసర ఖర్చు తగ్గించాలి. సరిపడా నిద్ర ఉండదు.
సింహం
వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఇష్టమైనవారితో విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కన్య
లక్ష్యాన్ని అతి తేలిగ్గా సాధిస్తారు. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. ఇతరులతో విరోధంలో మీదే పైచేయి అవుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఉద్యోగులు, అధికారుల ప్రశంసలను పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
తుల
కార్యసాధనలో అడ్డంకులను దాటాల్సివుంటుంది. శత్రువుల సంఖ్య పెరుగుతుంది. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసర జోక్యం వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు.
వృశ్చికం
ప్రతి కార్యాన్నీ అడ్డగించే వారుంటారు. స్థిర చిత్తంతో పని చేయాలి. తొందరపడి పోటీల్లో పాల్గొనకండి. గొడవలు వద్దు. ఉద్రేకాన్ని తగ్గించుకోండి. చెప్పుడు మాటలు నమ్మకండి. పైత్య, జీర్ణ సంబంధ సమస్యలు వుంటాయి.
ధనుస్సు
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. అన్ని రకాల బంధాలు బలపడతాయి. కొత్త విసయాలను గ్రహిస్తారు.
మకరం
పనులన్నీ సఫలమవుతాయి. వివాదాలు పరిస్కారమవుతాయి. కీర్తి పెరుగుతుంది. బంధువులతో విందులో పాల్గొంటారు. సందేహాలు తొలగిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనాదాయం పెరుగుతుంది.
కుంభం
బద్ధకం విడిచి కష్టపడాలి. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు వద్దు. చెడు ఆలోచనలను నియంత్రించాలి. వృథా ఖర్చును తగ్గించాలి. విలువైన వస్తువు దొంగతనమయ్యే సూచన వుంది. కడుపులో సమస్య వస్తుంది.
మీనం
పనులు ఆశించిన రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. బంధువులతో విరోధానికి ఆస్కారం వుంది. ఆలోచన విధానాన్ని సానుకూలంగా మార్చుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. ఆరోగ్యం జాగ్రత్త.