Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/2/2025)
Daily Horoscope Today In Telugu, February 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, February 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
మేషం
కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆస్తి వ్యవహారం అనుకూలించదు. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. నిందలు భరించాల్సి వస్తుంది. మనశ్శాంతి వుండదు.
వృషభం
మీ విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దలను ఆకట్టుకుంటారు. ఆశించిన పనులు సులువగా పూర్తవుతాయి. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. కీలకమైన వేళ అదృస్టం వరిస్తుంది.
మిథునం
కార్యవైఫల్యం ఉంది. నిరాశ చెందకుండా ఆటంకాలను దాటుకుంటూ సాగాలి. ఇంటికి దూరంగా వెళ్లే సూచనలు ఉన్నాయి. బంధువులతో గొడవలకు ఆస్కారముంది. వేళకు భోజనముండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటకం
అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది. అడగకుండానే అవసరమైన సాయం అందుతుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం
ఉన్నత పదవిలోని వారి ఆదరణను పొందుతారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పోటీల్లో విజేతలుగా ఉంటారు. మనశ్శాంతిని పొందుతారు.
కన్య
వ్యవహారాల్లో ఆటంకాలు అశాంతిని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. మీ బలహీనతలే అవరోధంగా మారతాయి. శత్రువుల కదలికలపై నిఘాపెట్టాలి. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తారు. దైవదర్శనం ఉంది.
తుల
వ్యవహారాలు, మీకు నచ్చని రీతిలో సాగడం కోపం తెప్పిస్తుంది. అనవసరంగా పోటీలకు దిగకండి. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. తగాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు లాభించవు.
వృశ్చికం
ఆకాంక్షలు నెరవేరతాయి. సంతాన సంబంధ శుభవార్త అందుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త బంధాలు బలపడతాయి. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనుస్సు
అన్ని పనుల్లోనూ శుభ ఫలితాలుంటాయి. ధనలాభం ఉంది. వేదన తగ్గుతుంది. న్యాయ వివాదాలు అనుకూలంగా వుంటాయి. పోయిన వస్తువు దొరుకుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శత్రువులను జయిస్తారు.
మకరం
పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. వాత సంబంధ సమస్య ఉంటుంది.
కుంభం
స్థిరాస్తి రంగంలోని వారు ఆర్థికంగా నష్టపోయే సూచన ఉంది. బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మీయులతోనే గొడవలు వస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
మీనం
అన్ని విధాలుగా అనుకూల ఫలితాలుంటాయి. ఆదాయం బావుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత వుంటుంది. కీలక వ్యవహారంలో సోదరుల తోడుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.