Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/2/2025)
Daily Horoscope Today In Telugu, February 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (6/2/2025)
Daily Horoscope Today In Telugu, February 6, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.
మేషం
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నోటిని అదుపులో ఉంచుకోండి. మాట తప్పిన ఫలితంగా అవమానం ఎదురవుతుంది. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. వేళకు భోజనం ఉండదు.
వృషభం
అదృష్టం వరిస్తుంది. పనులన్నీ ఆశించినట్లే జరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. వాహనయోగం ఉంది. విందుకు వెళతారు. గౌరవం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది.
మిథునం
కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. పనికి ఆటంకం వస్తుంది. బద్ధకం వీడి కష్టపడాలి. అనూహ్యమైన ఖర్చులు వస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. పోటీలకు దిగకండి.
కర్కాటకం
శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన విషయాలు తృప్తినిస్తాయి. ఆత్మీయులు సహకరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.శత్రుపీడ తగ్గుతుంది.
సింహం
ఇష్ట కార్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. బంధువులతో విందుకు హాజరవుతారు.
కన్య
పనులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. ఉద్యోగులకు చికాకుగా ఉంటుంది. సంతానం తీరు తృప్తినివ్వదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు తగ్గించాలి.
తుల
పనులు సవ్యంగా సాగవు. తొందరపాటు నిర్ణయాల వల్ల అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. పెద్దల కోపానికి గురవుతారు. పోటీలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారసత్వపు ఆస్తి వ్యవహారం లాభించదు.
వృశ్చికం
ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. కీర్తి పెరుగుతుంది.
ధనుస్సు
వ్యవహార జయం ఉంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీలక వివాదం సమసిపోతుంది.
మకరం
శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అనవసర జోక్యాల వల్ల విరోధులు పెరుగుతారు. వృథా ఖర్చులుంటాయి. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి. కీలక కార్యాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం
వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం కలుగుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. రహస్యాలు బయటపడే వీలుంది. శత్రువులపై నిఘా పెట్టండి. వృథా ఖర్చు వద్దు.
మీనం
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు.