Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (25/2/2025)

Daily Horoscope Today In Telugu, February 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-24 18:59 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 25, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.


మేషం 

లక్ష్యాన్ని సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. అజమాయిషీ చలాయించే బాధ్యతను చేపడతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.

వృషభం 

న్యాయపరమైన అంశాలపై దృష్టి పెట్టండి. వ్యవహారాల్లో అడ్డంకులుంటాయి. బద్ధకం వీడి శ్రమిస్తే సత్ఫలితం ఉంటుంది. సంప్రదాయ జీవనంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల అలసటే తప్ప ప్రయోజనం ఉండదు.

మిథునం 

అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. తగాదాలు వద్దు. కోపాన్ని నియంత్రించుకోండి. వేళకు భోజనం ఉండదు.

కర్కాటకం

కోరుకున్న కార్యం నెరవేరుతుంది. బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. బంధువులతో వినోదంగా గడుపుతారు.

సింహం 

గొడవలు సద్దు మణుగుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ముఖ్య వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రశాంతంగా ఉంటారు.

కన్య 

వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. ఇష్టకార్యం భంగమయ్యే వీలుంది. సహచరులతో సఖ్యత ఉండదు. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. గొడవలు వద్దు. వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

తుల 

ఆలోచనలు గందరగోళ పరుస్తాయి. శ్రేయోభిలాషులతో చర్చించండి. పనులు అనుకున్నట్లుగా సాగవు. బుద్ధి నిలకడగా ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవు. సహచరుల తీరు బాధిస్తుంది. ఖర్చు తగ్గించాలి.

వృశ్చికం 

ఆదాయం మెరుగవుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివితేటలకు గుర్తింపుంటుంది. మిత్రులు తోడుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులు సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనశ్శాంతి ఉంటుంది.

ధనుస్సు 

ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. మీ ప్రయత్నాలకూ అడ్డంకులు పెరుగుతాయి. అకారణ విరోధం గోచరిస్తోంది. కుటుంబంలో చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి.

మకరం 

వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. చక్కటి ప్రణాళికలతో కార్యాలను సాధించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. విందుకు హాజరవుతారు.

కుంభం 

అనవసర పంతాలు వద్దు. కీలక సమయంలో తీసుకునే తెలివైన నిర్ణయం మిమ్మల్ని సమస్యను బయట పడేస్తుంది. మిత్రులు సహకరిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. కంటి సమస్య, నిద్రలేమి వేధిస్తాయి.

మీనం 

ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మంచి సౌకర్యాలు సమకూరతాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. పోటీల్లో గెలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. బంధాలు బలపడతాయి.

Tags:    

Similar News