Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (24/2/2025)
Daily Horoscope Today In Telugu, February 24, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, February 24, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
మేషం
ఒడుదుడుకులు ఎదురైనా పనులు పూర్తవుతాయి. నిజాయితీగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. తండ్రి ఆలోచనలతో విభేదిస్తారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.
వృషభం
పనులు అనుకున్న రీతిలో జరగవు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. పంతానికి వెళ్లకండి. శత్రువుల బెడద పెరుగుతుంది. తగాదాలకు ఆస్కారం ఉంది. వేళకు భోజనం ఉండదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
మిథునం
నిజాయితీకి తగ్గ గుర్తింపు లభితుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ధనలాభం ఉంది. సంతాన యత్నాలు ఫలిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మిత్రులతో విందుకు వెళతారు.
కర్కాటకం
శుభ ఫలితాలను పొందుతారు. బలహీనతలను అధిగమిస్తారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. అదృష్టం తోడుంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సింహం
బద్ధకం వదిలి శ్రమిస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. అభీష్టం నెరవేరదు. కీలక నిర్ణయాల్లో మిత్రుల సూచనలు తీసుకోండి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. వృథా ఖర్చుంటుంది. వాత సంబంధ సమస్య ఉంటుంది.
కన్య
వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగవు. బుద్ధి నిలకడగా ఉండదు. సహచరుల తీరు చికాకుపరుస్తుంది. వృథా ఖర్చుంటుంది. స్థిరాస్తి, మైనింగ్ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
తుల
కీలక సమయంలో సత్తా చాటుతారు. సహచరులు తోడుంటారు. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థిక లబ్ది ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆత్మశాంతిని పొందుతారు.
వృశ్చికం
పనులు నెమ్మదిగా సాగుతాయి. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. మాట తప్పడం వల్ల సమస్య వస్తుంది. విడాకులు వ్యవహారాలు అనుకూలించవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త.
ధనుస్సు
పనులు సజావుగా సాగుతాయి. అదృష్టం వరిస్తుంది. ధనలాభం ఉంది. విందుల్లో పాల్గొంటారు. గౌరవం వృద్ధి చెందుతుంది. బాల్యమిత్రులను కలుస్తారు. తెలివితేటలకు ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
మకరం
ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. పంతం వీడండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. మిత్రుల వ్యక్తిగత విషయాల్లో మితిమీరిన జోక్యం వద్దు. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. నిద్రలేమి వేధిస్తుంది.
కుంభం
ఆకాంక్ష నెరవేరుతుంది. ఆనందం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలుతృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. శత్రుపీడ తొలగుతుంది. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.
మీనం
ఉన్నత పదవిలోని వారి సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అధికార వృద్ధి ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్థిర నివాస యత్నాలు అనుకూలిస్తాయి.