Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (21/2/2025)
Daily Horoscope Today In Telugu, February 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, February 21, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.
మేషం
నిర్దేశిత రీతిలో పనులు సాగవు. సౌకర్యాలు కూడా అనుకున్నట్లుగా సమకూరవు. మానసిక ఉద్రేకానికి గురి అవుతారు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. తగాదాలు గోచరిస్తున్నాయి. పోటీలు కలిసిరావు.
వృషభం
నిజాయితీకి తగ్గ గుర్తింపును పొందుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా వుంటాయి. స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా వుంటాయి. విందులో పాల్గొంటారు.
మిథునం
ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. ధన లాభం వుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం
వ్యవహారాల్లో ఆటంకాలు వుంటాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. చెడు ఆలోచనలు వస్తాయి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. విరోధం గోచరిస్తోంది. అనవసర జోక్యం వద్దు.
సింహం
కార్యనష్టం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధువులతోనే విరోధం గోచరిస్తోంది. సహకరించే వారు దూరమవుతారు. స్థిరాస్తి లావాదేవీల్లో జాగ్రత్త. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. మనశ్శాంతి వుండదు.
కన్య
ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నాయకత్వ లక్షణానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి.
తుల
ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చరాస్తుల క్రయవిక్రయాల్లో నష్టపోయే వీలుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనం వుండదు. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం
చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ధనలాభం వుంది. కీలక సమయంలో అదృస్టం తోడుంటుంది. వాహన సౌఖ్యం వుంది. గౌరవం పెరుగుతుంది. బాల్యమిత్రులతో వినోదంగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు
వ్యవహార నష్టం దిగులును కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం చూపితే భారీగా నష్టపోతారు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. ఇతరులతో జాగ్రత్త. వేళకు భోజనం వుండదు. వృథా ప్రయాణాలను మానండి.
మకరం
కొత్త స్నేహాలు లాభిస్తాయి. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. శత్రుపీడ తగ్గుతుంది. అదృష్టం వరిస్తుంది.
కుంభం
స్థిరనివాస యత్నాలు కొలిక్కి వస్తాయి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తండ్రి సామాజిక స్థితి మెరుగవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది
మీనం
వ్యవహారాలు సజావుగా సాగకపోవడం అశాంతిని కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శించే సూచన వుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.