Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (18/2/2025)

Daily Horoscope Today In Telugu, February 18, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-17 21:44 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 18, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

మేషం 

అన్ని పనుల్లోనూ సంతృప్తికర ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం వినోదంగా సాగుతుంది.

వృషభం 

వ్యవహారాలు లాభసాటిగా వుంటాయి. ధనలాభం వుంది. బంధుమిత్రులతో విందుకు హాజరవుతారు. చర్చల ద్వారా కీలక సమస్య పరిష్కారమవుతుంది. అదృష్టం తోడుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం 

కీలక నిర్ణయాల్లో మిత్రుల సూచనలను పాటించండి. ఆటంకాల వల్ల పనులు ఆలస్యంగా సాగుతాయి. అభీష్టం నెరవేరదు. వాత సంబంధ సమస్య వుంటుంది. విలువైన వస్తువులు దొంగతనమయ్యే సూచనవుంది.

కర్కాటకం

కార్యాలు ఆశించిన రీతిలో సాగవు. సమర్థించేవారు దూరమవుతారు. డబ్బుకి ఇబ్బందిగా వుంటుంది. బుద్ధి నిలకడగా వుండదు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. కుటుంబ సంబంధ విషయాలపై దృష్టి పెట్టండి.

సింహం 

వ్యవహారాల్లో విశేష లాభం వుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కుటుంబ సౌఖ్యం వుంటుంది. కీలక వ్యవహారాల్లో సోదరులు తోడుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణం లాభసాటిగా వుంటుంది.

కన్య 

ఇతరులపై ఆధారపడిన పనులు సవ్యంగా సాగవు. అనవసర జోక్యం వల్ల సమస్యలు వస్తాయి. విపరీతమైన ఖర్చులు మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి. వేళకు భోజనం వుండదు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపండి.

తుల 

చేపట్టిన ప్రతి కార్యం సఫలమవుతుంది. ధనలాభం వుంది. వాహనయోగం గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహంగా వుంటుంది. శుభవార్తను వింటారు. మానసిక ప్రశాంతత వుంటుంది.

వృశ్చికం 

పనులు అనుకున్నరీతిలో సాగవు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. పోటీల్లో పాల్గొనకండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. బద్ధకం వద్దు.

ధనుస్సు 

కొత్త స్నేహాలు ఏర్పడతాయి. విందులో పాల్గొంటారు. ధనలాభం వుంది. ఇతరుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. శుభకార్యాచరణ గురించి చర్చిస్తారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్ని పెంచుతాయి.

మకరం

ప్రభుత్వ సంబంధ సహాయం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా వుంటాయి. అధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.

కుంభం 

లక్ష్యసాధనలో కాస్త వెనుకబడతారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. అయినవారితో గొడవలు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వుంటే భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం 

ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వుండాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. తొందరపాటు నిర్ణయం వల్ల పైఅధికారుల కోపానికి గురవుతారు. ప్రత్యర్థుల బెడద పెరుగుతుంది. కీళ్ల సమస్య వుంటుంది.

Tags:    

Similar News