Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (17/2/2025)

Daily Horoscope Today In Telugu, February 17, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-17 00:36 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 17, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.


మేషం 

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అవసరమైన తోడ్పాటు లభించడంతో.. ప్రతి పనీ సునాయాసంగా పూర్తి అవుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

వృషభం 

ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టినా పనులు విజయవంతం అవుతాయి. ధనసంబంధ అంశాలు తృప్తినిస్తాయి. సంతానం తీరు ఒకింత కలవర పెడుతుంది. బంధువుల తోడ్పాటుతో సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మిథునం 

ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. అడ్డంకులు సృష్టించేవారు ఎక్కువగా వుంటారు. ఆర్థిక లావాదేవీల్లో నష్టం సూచిస్తోంది. గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారు మరింత జాగ్రత్తగా వుండాలి.

కర్కాటకం

బద్ధకం వల్ల నష్టపోయే సూచన వుంది. విసుగు చెందకుండా ప్రయత్నిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. సోదరుల సహకారంతో కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. ఆత్మధైర్యం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

సింహం 

ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. లక్ష్యాలను సాధించుకుంటారు. ధనలాభం వుంది. విలువైన వస్తువులను కొంటారు. ఎవరికీ హామీ ఇవ్వకండి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది.

కన్య 

ముఖ్యమైన పనులను మధ్యాహ్నం లోపే ముగించేయండి. అన్ని రంగాల్లోని వారికీ సత్ఫలితాలు వుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు వస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు.

తుల 

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా లేకుంటే ఇబ్బంది పడతారు. ఖర్చులను తగ్గించుకోవాలి. బాల్యమిత్రులను కలుస్తారు. ఎదుగుదలకు తగిన అవకాశాలు అందివస్తాయి.

వృశ్చికం 

వ్యవహారాలు శుభ ప్రదంగా సాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. బంధువులతో విందుకు వెళతారు. దూరప్రయాణం వుంది. బంధుమిత్రుల్లో ఒకరి ఆరోగ్యం కలవర పెడుతుంది.

ధనుస్సు 

అత్యంత యోగదాయకమైన రోజిది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తిగా సాగుతాయి. మీ సమర్థతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభసాటిగా వుంటాయి.

మకరం 

అభీష్టం నెరవేరుతుంది. అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. గౌరవం పెరుగుతుంది. పోటీల్లో మీదే పైచేయిగా వుంటుంది. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు.

కుంభం 

ప్రతి పనికీ అడ్డంకులు ఎదురవుతాయి. అపోహలు పెరుగుతాయి. చేయని తప్పుకు దండన అనుభవించాల్సిన పరిస్థితి వుంటుంది. పోటీలకు దిగకండి. ప్రత్యర్థుల కదలికలపై నిఘా వుంచండి. వాహనం నడిపేప్పుడు జాగ్రత్త.

మీనం 

పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు వుంటాయి. తగాదాలకు దూరంగా వుంటే మనశ్శాంతి లభిస్తుంది. 

Tags:    

Similar News