Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/2/2025)

Daily Horoscope Today In Telugu, February 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-12 23:00 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 13, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.


మేషం 

సామర్థ్యానికి మెరుగులు పెట్టాలి. అజాగ్రత్తగా ఉంటే నష్టపోతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. అభీష్టం కూడా నెరవేరే సూచన లేదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. సంతానం తీరు బాధిస్తుంది.

వృషభం 

సమర్థించే వారు వ్యతిరేకులగా మారతారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. విద్య, సేవారంగాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలి. వాహన సంబంధ సమస్య తలెత్తుతుంది. వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం 

వ్యవహార జయం వుంది. స్వయంకృషితో కార్యాలను సాధించుకుంటారు. ధనాదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగులు, వృత్తిపర నైపుణ్యంతో అధికారుల ప్రశంసలను పొందుతారు.

కర్కాటకం

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఓపికగా పనిచేసుకు వెళ్లాలి. నిందలూ భరించాల్సి వస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. ఎవరికీ హామీగా వుండకండి. నిజాయితీకి తగ్గ గుర్తింపు వుండదు. ఖర్చులు తగ్గించాలి.

సింహం 

ఆకాంక్ష నెరవేరుతుంది. ఎదుగుదలకు అవసరమైన అవకాశాలు వస్తాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. విందుకు హాజరవుతారు. కీలక సమయంలో అదృష్టం వరిస్తుంది. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతితో వుంటారు.

కన్య 

అనుకున్న రీతిలో పనులు సాగవు. ఆర్థిక లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. కీలక నిర్ణయాల్లో ఆచితూచి నడచుకోండి. దూర ప్రయాణం వుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.

తుల 

చేపట్టిన కార్యాలు సఫలమవుతాయి. ప్రయత్నాలకు ఇతరుల సహకారమూ తోడవుతుంది. ఇష్టులతో విందుకు హాజరవుతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ధనలాభముంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

వృశ్చికం 

మేలిమి అవకాశాలు అందివస్తాయి. ఎదిగేందుకు ఉపయోగించుకోండి. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. స్థిరచిత్తంతో చేపట్టిన ప్రతి కార్యం సఫలమవుతుంది. గౌరవం పెరుగుతుంది. బంధువులతో విందుకు వెళతారు.

ధనుస్సు 

ప్రతి అడుగులోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఆశించిన లక్ష్యం చేరుకోలేక పోతారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. వృథా ఖర్చు పెరుగుతుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మనశ్శాంతి వుండదు.

మకరం 

కోపాన్ని నియంత్రించుకోవాలి. ముఖ్యంగా చెప్పుడు మాటలను నమ్మకండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. పెద్దల కోపానికి గురవుతారు. ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. పోటీల్లో పాల్గొనకండి. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం 

శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. నూతన విషయాలను గ్రహిస్తారు. ఇతరులతో సత్సంబంధాలుంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.

మీనం 

స్థిరచిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. విభేదాలు సమసి పోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రత్యర్థులను జయిస్తారు. స్వస్థానప్రాప్తి వుంది. ధనలాభం గోచరిస్తోంది. ఆరోగ్యం బావుంటుంది.

Tags:    

Similar News