Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (11/2/2025)

Daily Horoscope Today In Telugu, February 11, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-10 23:30 GMT

Daily Horoscope Today

Daily Horoscope Today In Telugu, February 11, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

మేషం 

వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసిరావు. స్థిరాస్తి రంగంలోని వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

వృషభం 

ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అన్ని వైపుల నుంచీ సహకారం లభిస్తుంది. దాయాదులతో సమస్య పరిష్కారం అవుతుంది. సోదరులకు సంబంధించిన శుభసమాచారం వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.

మిథునం 

మనసులోని భావాలను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. విలువైన వస్తువులను భద్రంగా దాచండి. అకారణ విరోధం గోచరిస్తోంది. నోటిదురుసును తగ్గించుకోండి.

కర్కాటకం

ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం ఉంది. కీలక వ్యవహారంలో అదృష్టం కలిసొస్తుంది కీర్తిప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. మీసలహాలు, సూచనలకు గుర్తింపు లభిస్తుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.

సింహం 

వ్యవహారాల్లో నష్టం మానసిక దిగులుకు కారణమవుతుంది. నిరాశ చెందకుండా శ్రమించండి. దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వృథా ఖర్చును తగ్గించండి.

కన్య 

శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వినోదంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విందులో పాల్గొంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

తుల 

అన్ని పనుల్లో విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగుల సమర్థతకు తగ్గ గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులను ఓడిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.

వృశ్చికం 

న్యాయపరమైన అంశాలు చిక్కును తెస్తాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. పనుల్లోనూ అనుకూల ఫలితం ఉండదు. దూర ప్రయాణం ఉంది. త్వరగా అలసిపోతారు. ఖర్చు పెరుగుతుంది. గురువు ఆశీస్సు లభిస్తుంది.

ధనుస్సు 

తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. చెప్పుడు మాటలను నమ్మకండి. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి. ఉద్యోగులు, పైఅధికారుల కోపానికి గురవుతారు. తగాదాలకు దూరంగా ఉండండి.

మకరం 

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆనందంగా గడుపుతారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ధనలాభం ఉంది.

కుంభం 

అపార్థాలు తొలగిపోతాయి. మనసు తేలికగా ఉంటుంది. వ్యవహారాల్లో సత్ఫలితాలను పొందుతారు. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనలాభం ఉంది దైవక్షేత్రాన్ని దర్శిస్తారు.

మీనం 

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టకార్యం భంగమయ్యే సూచన ఉంది. అనవసర తగవులు వస్తాయి. చెడు ఆలోచనలను నియంత్రించండి. వాత సంబంధ సమస్య ఉంటుంది. ప్రేమ వ్యవహారుల అనుకూలించవు.

Tags:    

Similar News