Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (10/2/2025)

Daily Horoscope Today In Telugu, February 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

Update: 2025-02-09 18:45 GMT

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (10/2/2025)

Daily Horoscope Today In Telugu, February 10, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

మేషం 

పనులు సజావుగానే సాగుతాయి. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు వద్దు. ప్రయాణం ఉంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలించవు. మధ్యాహ్నం తర్వాత ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం 

ప్రారంభంలో కొద్దిగా ఒడుదుడుకులుగా అనిపించినా, చేపట్టిన కార్యం విజయవంతం అవుతుంది. బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది పెడతాయి. సోదరులు సహకరిస్తారు. ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించే సూచన ఉంది.

మిథునం 

అభీష్టం నెరవేరుతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. ప్రయాణాన్ని వాయిదా వేయండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.

కర్కాటకం

లక్ష్యాన్ని సాధిస్తారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. సంతాన సంబంధ విషయాలు గర్వించేలా చేస్తాయి. విందులో పాల్గొంటారు. ఆత్మీయులను కలుస్తారు. బంధువుల చికిత్సకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

సింహం 

అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. కుటుం సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రుణ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది.

కన్య 

ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. అవకాశాలను ఉపయోగించుకోండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. పెద్దల ఆదరణను పొందుతారు. వివాదాల జోలికి వెళితే మనశ్శాంతి కరువవుతుంది.

తుల 

ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. కోపాన్ని నియంత్రించుకోండి. పోటీల్లో పాల్గొనకండి. శత్రుపీడ పెరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అనూహ్య ఖర్చులుంటాయి. వేళకు భోజనం ఉండదు.

వృశ్చికం 

కోరిక నెరవేరుతుంది. ఆనందం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు 

వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. వివాదం పరిష్కారమవుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సూచన పాటించండి. కొత్త బంధాలు లాభసాటిగా ఉంటాయి.

మకరం 

శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. కొత్త వస్తువులను కొంటారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త.

కుంభం 

అప్రమత్తంగా ఉండాలి. వ్యవహారాలు బెడిసికొట్టే సూచన ఉంది. ముఖ్యంగా ఆస్తి లావాదేవీలు బాధిస్తాయి. సొంత నిర్ణయాలు అమలు చేయకండి. నమ్మినవారే మోసం చేస్తారు. జాగ్రత్త. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మీనం 

వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగానే ఉంటాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రయాణం వల్ల ప్రయోజనం వుంటుంది.

Tags:    

Similar News