Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు మంచి మాట‌కారులు.. ఇట్టే మాయ చేస్తారు

Birth Date: సంఖ్యాశాస్త్రం ప్రకారం మన పుట్టిన తేదీలో దాగి ఉన్న అంకెల ద్వారా మన వ్యక్తిత్వం, అభిరుచులు, బలహీనతలు, భవిష్యత్తు దిశను తెలుసుకోవచ్చు.

Update: 2025-05-02 01:30 GMT

Birth Date: సంఖ్యాశాస్త్రం ప్రకారం మన పుట్టిన తేదీలో దాగి ఉన్న అంకెల ద్వారా మన వ్యక్తిత్వం, అభిరుచులు, బలహీనతలు, భవిష్యత్తు దిశను తెలుసుకోవచ్చు. ఇవి కేవలం గణిత పరమైన అంకెలు మాత్రమే కాదు, మన జీవన విధానాన్ని ప్రభావితం చేసే విశిష్ట శక్తులు అని చెబుతుంది ఈ శాస్త్రం.

ప్రతి సంఖ్యకు ఒకదాని ప్రత్యేకత ఉంది. 1 నుంచి 9 వరకూ ఉన్న ప్రతి అంకెకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. ఇవి మన ఆలోచనా విధానాన్ని, సంబంధాలను, అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. వాటి ఆధారంగా మనలో ఉన్న గుణాత్మకతను వెలికితీసి మన దారిని స్పష్టంగా చూసే దిశలో సహాయపడుతుంది.

ఉదాహరణకు, 5, 14, 23 తేదీల్లో జన్మించిన పిల్లల గురించి చూద్దాం. వీరి జన్మ సంఖ్య "5". ఈ సంఖ్యకు అధిపతి గ్రహంగా బుధుడు ఉంటాడు. బుధుడు తెలివితేటలు, మాటతీరు, వాణిజ్య మేధస్సును సూచించే గ్రహం. అందువల్ల ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ఆశ్చర్యకరమైన బుద్ధిశక్తిని ప్రదర్శిస్తారు.

వీరి ఆలోచన శక్తి వేగంగా పనిచేస్తుంది. చుట్టూ జరిగే సంఘటనలపై త్వరగా అవగాహన పెంపొందించుకుంటారు. సమస్యలపై చక్కటి విశ్లేషణ చేసి సమాధానాలను తొందరగా కనుగొంటారు. వీరి తెలివి వల్ల ఏ పని చేయాలన్నా త్వరగా నేర్చుకుంటారు, ఆచరణలో పెట్టగలుగుతారు.

ఈ సంఖ్యకు చెందిన వారు బాగా మాట్లాడ‌గ‌లుగుతారు. వారి మాటల్లో ఆకర్షణ ఉంటుంది. చక్కటి భాషా నైపుణ్యం వల్ల వీరు జనంలో ఆదరణ పొందుతారు. స్నేహాలు తేలికగా ఏర్పరచుకుంటారు. వారి సహజమైన మాట‌ల‌తో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి.

సామాజికంగా కూడా ఈ పిల్లలు ఎంతో చురుకుగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. మార్పును ఆహ్వానిస్తారు. కొత్త ఆలోచనలను అంగీకరించడంలో ముందుంటారు. వీరు పరిశుభ్రతను ఎంతో ప్రాధాన్యంగా చూస్తారు. తాము ఉన్న స్థలం, దుస్తులు, శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో శ్రద్ధ వహిస్తారు. మొత్తంగా చెప్పాలంటే ఈ తేదీల్లో జన్మించినవారు తెలివైన వారు, చక్కటి మాటతీరు క‌లిగి ఉంటారు.

Tags:    

Similar News