Astrology: మీ ఊరి నుండి ఈ వస్తువులను ఎప్పుడూ తీసుకురాకండి!
Astrology: ప్రతి స్త్రీకి పుట్టిల్లు స్వర్గం లాంటిది. అయితే, పెళ్లి తర్వాత స్త్రీకి పుట్టిల్లు కూడా పరాయి ఇళ్లు లాగా మారిపోతుంది.
Astrology: మీ ఊరి నుండి ఈ వస్తువులను ఎప్పుడూ తీసుకురాకండి!
Astrology: ప్రతి స్త్రీకి పుట్టిల్లు స్వర్గం లాంటిది. అయితే, పెళ్లి తర్వాత స్త్రీకి పుట్టిల్లు కూడా పరాయి ఇళ్లు లాగా మారిపోతుంది. చుట్టం చూపుకు వచ్చినట్లు ఉంటుంది స్త్రీ పరిస్థితి. అయితే, కొన్ని సంప్రదాయాల ప్రకారం ఆమె పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తీసుకువెళ్లడం అశుభమని నమ్ముతారు. ఈ వస్తువులను తీసుకువెళ్లడం మంచిది కాదని అంటారు. అయితే, ఏ వస్తువులను పుట్టింటి నుండి తీసుకెళ్లడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇనుప వస్తువులు
నిపుణుల ప్రకారం..పుట్టింటి నుండి ఇనుప వస్తువులను తీసుకువెళ్లడం అశుభం. గతంలో ఇనుప పెట్టెలు ఇవ్వడం సర్వసాధారణం. అయితే, ఇప్పుడు దీనిని అశుభంగా పరిగణిస్తున్నారు. రెండవది, పాత లేదా ఉపయోగించిన వస్తువులను తీసుకువెళ్లడం కూడా అశుభమని నమ్ముతారు. వీటికి ప్రతికూల శక్తులు ఉండవచ్చని, కొత్త ఇంట్లో సమస్యలను కలిగిస్తాయని అంటున్నారు.
ఆహార పదార్థాలు
పుట్టింటి నుండి చింతపండు కూడా తీసుకువెళ్లకూడదని అంటారు. ఎందుకంటే, అది గొడవలు, తగాదాలకు దారితీస్తుంది. పత్తిని తీసుకువెళ్లడం కూడా అశుభకరమని భావిస్తారు. పాలు, పెరుగు, నెయ్యి వంటి ఆహార పదార్థాలను, చీపుర్లను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్లకూడదని అంటారు. ఎందుకంటే, ఇవి ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి.