Nellore: పెన్షన్ల పంపిణీ పై ఆందోళన

మండల కేంద్రంలోని స్థానిక మూడో సచివాలయాన్ని జెడ్పి సీఈఓ సుశీల సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది తో సమావేశమయ్యారు.

Update: 2020-02-12 09:53 GMT

సంగం: మండల కేంద్రంలోని స్థానిక మూడో సచివాలయాన్ని జెడ్పి సీఈఓ సుశీల సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది తో సమావేశమయ్యారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పింఛన్లు కోల్పోయిన వారితో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతీ ఒక్కరికీ పాత బకాయిలతో పాటు అందజేస్తామని తెలిపారు.

జిల్లాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే ను ముమ్మరంగా చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి అందజేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేంద్ర బాబు,సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


Tags:    

Similar News