రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ వెబ్ సైట్ లేదా క్యాలెండర్ లో గానీ ఎక్కడైనా కానీ ‘ఏసు’ అనే పదం వుంటుందా? ఎందుకు పెడతాం? హిందూ ఆలయం ఇది?

Update: 2019-12-01 16:38 GMT
yv subbareddy

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు, ఆయనకు తొత్తుగా మారిన వారి దుష్ప్రచారానికి తెరదించే కార్యక్రమం చేపట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

టీటీడీ వెబ్ సైట్ లేదా క్యాలెండర్ లో గానీ ఎక్కడైనా కానీ 'ఏసు' అనే పదం వుంటుందా? ఎందుకు పెడతాం? హిందూ ఆలయం ఇది?ఎవరు చేస్తారు అన్యమత ప్రచారం? ఎందుకు చేస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. టీటీడీ వెబ్ సైట్ లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, దీనిపై 'గూగుల్' వివరణ అడుగుతామని చెప్పారు. టీటీడీ వెబ్ సైట్ లో దుష్ప్రచారం జరగకుండా వుండేందుకు సైబర్ క్రైమ్ విభాగాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ను కోరనున్నట్టు తెలిపారు.

Full View

Tags:    

Similar News