YSRCP 10th Foundation Day: ఉవ్వెత్తున ఎగిసిన కెరటం!

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మొండిదైర్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ

Update: 2020-03-12 04:41 GMT

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మొండిదైర్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఒంటరిగా బరిలోకి దిగి నేడు ముఖ్యమంత్రిగా నిలదొక్కుకున్నాడు. నేడు అయన స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈసుదీర్ఘ ప్రయాణంలో పార్టీ తరపున, వ్యక్తిగతంగా తోడుగా ఉన్న అందరికి జగన్ ధన్యవాదాలు తెలుపుతూ నిన్న ట్వీట్ చేశారు.. "మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీఅందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని జగన్ పేర్కొన్నారు.

2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా పోటీ చేసి లక్షా 78వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2009 సెప్టెంబర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించినా కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. దీనితో అధిష్టానంతో విభేదించి కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైయస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు జగన్ . ఇక 2011లో 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' (YSRCP)ని స్థాపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి 5 లక్షల 43 వేల మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు..

ఇక 2012లో ఆస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి పార్టీని బలోపేతం చేశారు. 2014 ఎన్నికల ముందు ప్రజల్లోకి తమ పార్టీ మ్యానిఫెస్టోని, సిద్దాంతాలను తీసుకువెళ్ళారు. కానీ ఆ ఎన్నికల్లో ఆ పార్టీ 67 సీట్లను దక్కించుకొని ప్రతిపక్ష హోదాను పొందింది. ఆ తర్వాత పార్టీలోని ఎమ్మేల్యలు, ఎంపీలు టీడీపీలోకి వెళ్ళినప్పటికీ దైర్యం కోల్పోలేదు.. ప్రజా సమస్యలపై, ప్రత్యేకహోదా పైన పోరాడుతూ ముందుకుసాగారు. 2017లో పాదయాత్రను ప్రారంభించి మూడువెయిల కీలోమీటర్లు నడించి ప్రజా సమస్యలని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.

ఇక 2014 ఎన్నికల ముందు 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించి అందరిని మరింతగా ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ఎవ్వరు ఉహించని విజయాన్ని సాధించి, రాజకీయాల్లో ఉద్దండులను సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఇక నవ్యాంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో చెప్పిన నవరత్నాలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. 

Tags:    

Similar News