YSRCP: కరోనా కట్టడికి వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నడుం బిగించారు.

Update: 2020-03-25 05:10 GMT

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు నడుం బిగించారు. కరోనా కట్టడిలో భాగంగా తమ వంతు సాయంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా

కరోనా వైరస్‌ కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పనిచేస్తున్నారని అభినందించారు. 'దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో వైరస్ ను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిరోధక చర్యల అవసరాలకు మరియు వ్యాధి గ్రస్తుల చికిత్స కోసం నా వంతు సహాయంగా ఎంపీ లాడ్స్ నుండి 25,00,000/- లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయడం జరిగింది.' అని ఆ పార్టీ అమలాపురం లోక్ సభ సభ్యురాలు చింతా అనురాధ తెలిపారు.


Tags:    

Similar News