V Vijaysai Reddy: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ విడుదల

V Vijaysai Reddy: విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం జగన్

Update: 2024-01-17 08:14 GMT

V Vijaysai Reddy: అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్‌ విడుదల

V Vijaysai Reddy: ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఎల్లుండి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ పోస్టర్‌ను రిలీజ్ చేశారు వైసీపీ మంత్రులు, ఎంపీలు. ఎల్లుండి జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. సామాజిక సమతా సంకల్ప పేరుతో సభ నిర్వహించనున్నారు. బాబాసాహెబ్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అంబేద్కర్ ఆశయాలను బడుగు బలహీనవర్గాలకు అమలు చేస్తున్నామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా రూపొందించాలని సీఎం జగన్ భావించారన్నారు. చరిత్ర పుటల్లో బాబాసాహెబ్ విగ్రహం నిలిచిపోతుందని అన్నారు ఎంపీ విజయసాయి.

Tags:    

Similar News