ఏపీ గురించి డబ్ల్యూహెచ్ఓ ఆరా తీస్తోంది : ఎంపీ విజయసాయిరెడ్డి

కరోనా వైరస్ ని ఎదురుకోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యద్భుతంగా పని చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Update: 2020-04-24 09:21 GMT
MP vijayasai reddy

కరోనా వైరస్ ని ఎదురుకోవడంలో ఏపీ ప్రభుత్వం అత్యద్భుతంగా పని చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆరా తీస్తోందని వ్యాఖ్యానించారు.. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

''రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డబ్ల్యూహెచ్ఓ కూడా ఆరా తీస్తోంది.'' అని పేర్కొన్నారు.

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. తాజా కేసులతో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 145మంది డిశ్చార్జి కాగా.. 29మంది ప్రాణాలు కోల్పోయారు.




 



Tags:    

Similar News