MP Mithun Reddy Arrested: ఏపీ మద్యం కుంభకోణం.. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

MP Mithun Reddy Arrested: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్ట్‌ చేసింది

Update: 2025-07-19 15:58 GMT

MP Mithun Reddy Arrested: ఏపీ మద్యం కుంభకోణం.. వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

MP Mithun Reddy Arrested: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో ఆయన్ను నాలుగో నిందితుడిగా గుర్తించిన సిట్‌ అధికారులు, శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటలపాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం.

సిట్‌ విచారణలో కీలక అంశాలపై మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల పంపిణీ, ప్రైవేట్ భేటీల వ్యవహారాలు, అలాగే లబ్ధిదారుల వరకు నిధుల ప్రవాహంపై అధికారులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా ప్రక్రియను ఆన్‌లైన్‌ నుంచి మాన్యువల్‌ విధానానికి మార్చడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సిట్‌ నివేదికలో వెల్లడైంది. ఈ మార్పు అనంతరం పారదర్శకత లోపించి, అవకతవకలకు చోటిచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికే మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టులో చేసిన పిటిషన్‌ను కూడా శుక్రవారం నాడు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

అయన అరెస్టు విషయం అధికారికంగా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులపై కూడా సిట్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:    

Similar News