YSRCP MLC Nominations: నామినేషన్‌ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

YSRCP MLC Nominations: బీఫారమ్స్‌ అందజేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్

Update: 2023-03-09 12:01 GMT

YSRCP MLC Nominations: నామినేషన్‌ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

YSRCP MLC Nominations: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏడుగురు YSR CP అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వారిలో పెనుమత్స సురేష్‌, కోలా గురువులు, ఇజ్రాయిల్‌, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు తొలుత సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా వారికి సీఎం జగన్‌ బీ ఫారమ్స్‌ అందజేశారు. అనంతరం వారు అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. జగన్ నాయకత్వంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నామని సజ్జల తెలిపారు.

Tags:    

Similar News