MLC Anantha Babu: వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
MLC Anantababu: ఏపీలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పై వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
MLC Anantha Babu: వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
MLC Anantababu: ఏపీలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పై వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం సాయంత్రం కీలక ప్రకటన చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.