Jagan Dream: మీ కలే జగన్ కల.. వైఎస్ఆర్‌సీపీ కొత్త ప్రచారం
Jagan Dream: అక్కచెల్లెమ్మల కల - జగనన్న కల అంటూ హోర్డింగులు
Jagan Dream: మీ కలే జగన్ కల.. వైఎస్ఆర్‌సీపీ కొత్త ప్రచారం
Jagan Dream: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోన్న అధికార వైసీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటివరకు సిద్ధం నినాదంతో ప్రచార సభలను నిర్వహించిన వైసీపీ.. సిద్ధం సభల అనంతరం నాకు ఒక కల ఉందనే నినాదంతో క్యాంపెయిన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు వెలియగా.. తాజాగా నాకు ఒక కల ఉంది అనే ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నగరం, ప్రతి వాడలో... మీ కల నా కల అంటూ హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షం అవుతున్నాయి. జగన్ ప్రారంభించనున్న మీ కల నా కల ప్రచారంలో... మొత్తం 6 వర్గాలకు చెందిన హోర్డింగ్‌లు ఉన్నాయి.