చంద్రబాబు కోసమే పవన్ వారాహి యాత్ర అంటూ వైసీపీ విమర్శలు

YSRCP: పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా.?

Update: 2023-06-30 13:53 GMT

చంద్రబాబు కోసమే పవన్ వారాహి యాత్ర అంటూ వైసీపీ విమర్శలు 

YSRCP: వపన్ కల్యాణ్ వారాహి యాత్రపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. సీఎం జగన్ మొదలుకొని మంత్రులు, వైసీపీ కీలక నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. వారాహి కాదు నారాహి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు కోసమే పవన్ నారాహి ప్రయాణం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం అంటూ కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు.

పవన్‌ను ఎదుర్కొనేందుకు ముద్రగడ అస్త్రాన్ని సంబంధించింది వైసీపీ. గోదావరి జిల్లాలో తమ ఓటు బ్యాంకు నష్టపోకుండా పవన్‌పైకి ముద్రగడ్డ అస్త్రాన్ని ప్రయోగించింది. పవన్‌కు ఓటు వేస్తే బాబు ఓటు వేసినట్టే అని వైసీపీ నాయకులు బలంగా ప్రచారం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు, పవన్ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసురుతున్నారు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో... పోతుల్లో ఎన్ని సీట్లు తెచుకుంటరో చంద్రబాబు వద్ద తేల్చుకోవాలి అధికార వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో పవన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ ముఖ్యమంత్రి అవ్వాలి అని కాపులు అనుకుంటే చంద్రబాబును పవన్ సీఎం చేయాలని పవన్‌ అనుకుంటున్నారు అని రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. 

Tags:    

Similar News