YS Sharmila: ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు
YS Sharmila: పదేళ్లు గడుస్తున్నా విభజన హామీలు ఎందుకు నెరవేరలేదు
YS Sharmila: ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు
YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేశారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని చెప్పారని... ఇన్నేళ్లు గడుస్తున్నా... నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ఏపీని పట్టించుకోక పోయినా... వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేని కారణంగా చట్టసభల్లో మాట్లాడలేక పోతున్నామని షర్మిల అన్నారు.