జగనన్న తోడు స్కీమ్ ప్రారంభానికి సర్వం సిద్ధం
జగనన్న తోడు స్కీమ్ ప్రారంభానికి సర్వం సిద్ధం
CM Jagan (file image)
Andhra Pradesh | ఏపీలో జగనన్న తోడు స్కీమ్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల రుణం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి జగనన్న తోడు ద్వారా రుణం ఇప్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను గుర్తించిన అధికారులు.. దాదాపు 3.60 లక్షల మంది దరఖాస్తులను వివిధ బ్యాంకులకు పంపించారు. రేపటి జగనన్న తోడు స్కీమ్ ప్రారంభోత్సవానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఏపీ మంత్రులను ఆహ్వానించారు.