కాసేపట్లో కలెక్టర్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ కాన్ఫరెన్స్‌

Update: 2019-06-24 02:24 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో 13 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. నవరత్నాల అమలు, పారదర్శక పాలనే లక్ష్యంగా ఈ సదస్సులో కలెక్టర్లకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌‌, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌‌,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో నేడు ఆరు అంశాలపై జగన్ చర్చించనున్నారు. సదస్సు ప్రారంభం కాగానే కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో పారదర్శకతను ఇస్తున్న ప్రాధాన్యతను వివరించనున్నారు. తొలుత ఇదే అంశంతో పాటు గ్రామ సచివాలయాల ఏర్పాట్లు, వాలంటీర్ల నియామక అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ, పౌరసరఫరాలు, విద్య, కరువు పరిస్ధితులు, గృహ నిర్మాణ రంగాలపై చర్చించారు. ఒక్కో అంశంపై అరగంట పాటు చర్చించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి రోజు కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయానికి వెళ్లనున్నారు. పాలనపరమైన కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. దీంతో పాటు ఈ రోజు రాత్రి IASలకు సీఎం వైఎస్‌‌ జగన్‌‌ విందు ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News