CBI Court: నేడు జగన్ బెయిల్ రద్దు తుది తీర్పుపై ఉత్కంఠ
* పిటిషన్ పై గతంలో కౌంటర్‌లు దాఖలు చేసిన జగన్ * నేడు జగన్ బెయిల్ రద్దుపై తుది తీర్పు ప్రకటించనున్న సీబీఐ కోర్టు
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సీబీఐ తీర్పు(ఫోటో: ది హన్స్ ఇండియా)
Andra Pradesh: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సీబీఐ కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలైలో వాదనలు ముగిశాయి. పిటిషన్‌పై గతంలో జగన్ కౌంటర్‌లు దాఖలు చేశారు దాంతో ఇవాళ జగన్ బెయిల్ రద్దు పై తుది తీర్పు ప్రకటించనుంది ఇద్దరి వాదనలు విన్ని కోర్టు తీర్పును రిజర్వు చేసింది సీఎంగా తనకుండే అధికారాలను ఉపయోగించి జగన్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు.
బెయిల్ రద్దు చేసిన ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామ పిటిషన్‌లో కోరారు ఆయనతో పాటు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుండడంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.