విశాఖ జూ పార్కులో విషాదం.. ఎలుగుబంటి దాడి.. వ్యక్తి మృతి

Visakhapatnam: ఎంక్లోజర్ శుభ్రం చేస్తుండగా ఘటన

Update: 2023-11-27 10:27 GMT

విశాఖ జూ పార్కులో విషాదం.. ఎలుగుబంటి దాడి.. వ్యక్తి మృతి 

Visakhapatnam: విశాఖ జూ పార్క్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్‌ చేస్తుండగా సంఘటన సంభవించింది. ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తీర్చుకున్నాయో, ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది. జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాల నగేష్‌ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags:    

Similar News