Siddam Sabha: ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ.. సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Siddam Sabha: 15 లక్షల మంది తరలివస్తారని వైసీపీ అంచనా

Update: 2024-03-10 03:45 GMT

Siddam Sabha: ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ.. సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి 

Siddam Sabha: ఇవాళ బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం ఆఖరి సభ నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రహదారి పక్కనే వంద ఎకరాల సువిశాల మైదానంలో సభకు 15లక్షల మంది తరలి వస్తారని వైసీపీ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల , పల్నాడు , ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, భారీ సంఖ్యలో కదిలి రానున్నారు. మూడు సిద్ధం సభలు సక్సెస్ కావడంతో నాల్గోసభకు ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు తరలి రావడానికి సంసిద్ధమయ్యారు. సభా స్థలంలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

సిద్దం సభలో సీఎం జగన్‌ మేనిఫెస్టో ను ప్రకటించనున్నారు. గత మేనిఫెస్టను 98శాతం అమలు చేశామని వైసీపీ నేతలు చెప్పారు. నేటి ప్రకటించే మేనిఫెస్టోలో మరో మరిన్ని కొత్త పథకాలకు నిధులను పెంచడంతో పాటు ఒట్రెండు కొత్త పథకాలను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. సిద్ధం సభ కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు నేపథ్యంలో సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Tags:    

Similar News