Jagan Posters: సిద్ధం.. సై.. రాత్రికి రాత్రే ప్రధాన కూడళ్లలో వెలసిన హోర్డింగ్స్
Jagan Posters: తండ్రి కలను ముందకు తీసుకువెళ్తున్నట్టు పోస్టర్ డిజైన్
Jagan Posters: సిద్ధం.. సై.. రాత్రికి రాత్రే ప్రధాన కూడళ్లలో వెలసిన హోర్డింగ్స్
Jagan Posters: ఏపీలో ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందంటూ..వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని అన్ని జంక్షన్లలో రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు దర్శనమివ్వడంతో... ఎన్నికల వేడి హీటెక్కిస్తోంది. పోస్టర్ డిజైన్‌పై కూడా సర్వత్ర చర్చ నడుస్తోంది. పోస్టర్‌లో సీఎం జగన్ తండ్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో ఉండగా.. ముందు జగన్ ఫొటో.. ఏర్పాటు చేశారు. తండ్రి కలను వారసుడు కొనసాగిస్తున్నాడంటూ.. శ్రేణులు అభివర్ణిస్తున్నారు..
అయితే... ఏపీలో ఇప్పటికే రాజకీయాలు హీటెక్కాయి. అన్ని పార్టీలు కార్యచరణలను సిద్ధం చేసుకుంటున్న వేళ.. అధికార వైసీపీ ఓ అడుగు ముందుకు వేసి.. ఎన్నికలకు తాము సిద్ధం అనే పేరుతో సభలను నిర్వహించేందకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం భీమిలీలో మొదటి సభ నిర్వహించనుంది. ఈసభలతో వైసీపీ క్యాడర్‌లో నయా జోష్ నెలకొంది.