Chandra Babu: ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలి
Chandra Babu: మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు తీసుకువస్తాం
Chandra Babu: ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలి
Chandra Babu: ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష‌్ట్రం సర్వ నాశనమైందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకువచ్చినట్లు చెప్పారు.