వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి

Update: 2020-02-21 05:39 GMT
వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి

గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై కొందరూ గుర్తు వ్యక్తులు దాడి చేశారు. కోటప్పకొండ కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కోటప్పకొండకు వెళ్లి ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా.. ఈ దాడి జరిగినట్లు వార్తులు వస్తున్నాయి. అయితే కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైంది. తీరా చూస్తే కారులో రజనీ లేరనీ తెలియడంతో కారులో ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు ఉన్నారంటూ.. దాడి చేశారు. ఇంతలోనే అక్కడకు వైసీపీ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు, వైసీపీ కార్యకర్తలూ కొట్టుకున్నట్లు తెలిసింది. కారుపై టీడీపీ దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడవారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గోపీనాథ్‌ తెలిపారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అయితే టీడీపీ చెందిన వారే తమను టార్గెట్‌ చేశారని ఎమ్మెల్యే విడదల రజని ఆరోపించారు. రాళ్లు, రాడ్లతో కారును ధ్వంసం చేశారని, టీడీపీ నేతలు ఎన్నికల్లో ఓటమిని కాపలా కాసి దాడులు చేయడం లేదని, ప్రజాక్షేత్రంలో గెలవాలని ఎమ్మెల్యే రజని సవాల్‌ విసిరారు.


  

Full View


Tags:    

Similar News